Tuesday, May 3, 2011

ఒసామా ఇండియాకి దొరికి ఉంటే.........



ఒసామా ఇండియాకి దొరికి ఉంటే.........

- అతన్ని పట్టుకుని ఒక భవనం లాంటి జైలు కట్టి అందులో ఉంచుతాం....
- దాని చుట్టూ కొన్ని వందల మంది (ohh కసబ్ కే వందలు కాబట్టి ఇక్కడ వేల మంది ఉండాలి...)
- పట్టుకున్న వాళ్లకి ఒక మెడలు ఇస్తాం....
- ఒసామాకి ఒక మంచి లాయరు ని ఏర్పాటు చేస్తాం.. లయర్లందరూ మేము వాదించం అంటే ఎవరినో కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పిస్తాం...
- అసలు ఇతను ఒసామా నేనా అని ఒక 2 yrs కనుక్కుంటాం...
- ముందు కేసు హై కోర్టులో వేస్తాం.... అసలు అతను నిజంగానే చెడ్డవాడా లేకపోతే మంచివాడే కాని మనమే అనవసరంగా పోరబడ్డామా అని..
- ఈ లోగ న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్ళు ప్రతి సంవత్సరం అతన్ని పట్టుకున్న తేదిన....anniversaries జరుపుతూ అతని ఫైల్ ఫోటో ఒక్కటే వేసి విబ్భిన్న కథనాలు వినిపిస్తారు... దానికి తోడు "కసబ్ ని ఎం చేయాలి??" మీ సమాధానాలను 'Kasab ' రాసి '420420' కి sms చేయండి... అంటూ సుత్తి పోలింగులు పెడతారు.....
- ఈ లోగ బాలీవుడ్ వాళ్ళు "సర్ మీ గడ్డం సూపర్... మీకు బెయిల్ వస్తే మేము మీతో సినిమా తీస్తాం" అని చెప్తారు...
- Human rights వాళ్ళు 'ఒసామా ని సరిగ్గా చూసుకోవట్లేదు... ' అని గొడవ చేస్తుంటారు...
- మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని "వీడు మీ వాడే కదా.." అంటే... "అబ్బే అసలు వాడి పేరు కూడా మేము వినలేదు.." అని వాళ్ళు సమాధానం చెప్తారు... (వాడు పాకిస్తాన్ నుంచి వస్తే ఏంటో... అంటార్క్టికా నుంచి వస్తే ఏంటో నాకు తెలీదు...)
- నా లాంటి వాళ్ళు వాడిని ఎందుకు ఉరి తీయట్లేదు అని ఇలా బ్లాగుల్లో .. facebook లో గొడవ చేస్తుంటారు.... ఇంకొంచెం కోపం ఉన్న వాళ్ళు రోడ్ షోలు , candle షోలు చేస్తుంటారు...
- భారత ప్రభుత్వం - "మేము terrorism ని ఉక్కు పాదం తో అనచివేస్తం..." (ఎవడి పాదమో తెలీదు...) అని ప్రెస్ statements ఇస్తుంటారు...
- ఈ process లో కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు చేస్తాం.... ప్రతి సంవత్సరం లోటు budget చూపిస్తాం....
- తరువాత కేసు supreme court కి వెళ్తుంది..... అక్కడా ఇదే తంతు...
- ఈ లోగా వాడి 99 వ పెళ్ళామో 199 వ పెళ్ళామో, మా ఆయనకు క్షమా భిక్ష పెట్టండి అని president కి అర్జీ పెట్టుకుంటుంది...
- ఈ లోగ ఎవరైనా minster కూతురు/కొడుకునో లేదా flight నో hijack చేస్తే .... వాణ్ని తీసేసుకోండి బాబు.. ఇంకా జనాల్ని చంపేయండి అని తిరిగి అప్పగిచ్చేస్తం...(జీవితం గగనం సినిమాల ఉండదు మరీ...)
- ఇంతా అయిన తరువాత ఉరి శిక్ష వేస్తే... ఉరి తీయడానికి ఎవరు ఉండరు...

అదే అమెరికా వాళ్ళయితే 'వచ్చామా... చంపెసామా... సముద్రంలో పడేసామా.....' అంతే....
ఇంకా కసబ్ ని ఉరి తీయకుండా కూర్చోబెట్టి మేపితే.... ఇదేదో బాగుందే.... వీడియో గేమ్ ఆడినట్టు అందరిని చంపేసి హాయిగా వచ్చి security మధ్యలో జీవితం గడపొచ్చు అని ఇంకా కసబ్ లు పుట్టుకొస్తారు...

9 comments:

  1. ...(జీవితం గగనం సినిమాల ఉండదు మరీ...)
    :))

    ReplyDelete
  2. baagundi mee frustration ni vengyam ga cheppina teeru:)

    ReplyDelete
  3. Followers widget pedite follow avadaaniki haayiga untundi kadandi..

    ReplyDelete
  4. ardham kaaledandi vivekanand gaaru..

    ReplyDelete
  5. ardhamayindi... add chesanu... :-)
    Thank you for letting me know..

    ReplyDelete
  6. Mee blog Archive ni flat list lo pettukondi..lekapote it will start creating very big chains of internal links which can effect ur google search and page rank.

    ReplyDelete
  7. Page Elements--->blog archive widget lo unna edit click cheyandi---> Style ane option lo meeku dropdown ani,flat ni ila 3 options untay..andulo flat select chesi save cheyandi.

    ReplyDelete